ఇద్దరు పిల్లలతో పాటు బావిలో దూకిన తల్లి.. చిన్నారులు మృతి - mother and children suicide attempt in vishaka
09:03 February 14
ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా రోలుగుంట మండలం జగ్గంపేటనాయుడుపాలెం దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న స్వల్ప వివాదం ఇద్దరు చిన్నారులను బలితీసుకుంది. జగ్గంపేట నాయుడుపాలెం గ్రామానికి చెందిన నాగరాజుకు ఆరేళ్ల క్రితం సాయితో వివాహమైంది. వీరికి భాను(5), పృధ్వీ(3) పిల్లలున్నారు. నాగరాజు ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. సాయి ఇంటి వద్దే ఉంటూ.. పిల్లల యోగక్షేమాలు చూసుకుంటోంది. ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో.. డబ్బుల కోసం చెలరేగిన చిన్న వివాదం కలతలు రేపాయి.
మనస్తాపం చెందిన సాయి తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసింది. అయితే సాయి ప్రాణాలతో బయటపడగా.. ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికుల సాయంతో బావిలోని పిల్లల మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: