అత్తింటి వారి నుంచి అదనపు కట్నం వేధింపులు తీవ్రతరం కావడంతో ఆరు నెలల కుమార్తె సహా ఓ వివాహిత నీటిసంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
అత్తింటి వారి నుంచి అదనపు కట్నం వేధింపులు తీవ్రతరం కావడంతో ఆరు నెలల కుమార్తె సహా ఓ వివాహిత నీటిసంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
కరీంనగర్ సిక్కువాడిలో నివాసముంటున్న పాత నాగార్జునకు, వేములవాడకు చెందిన మౌనిక(30)తో 2018లో పెద్దలు నిర్ణయించిన వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ సాప్వేర్ సంస్థలో నాగార్జున ఉద్యోగం చేస్తుండటం వల్ల మౌనికను సైతం తన వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. కరోనా కారణంగా ఏడాది క్రితం కరీంనగర్‌కు వచ్చిన నాగార్జున దంపతులు స్థానిక సిక్కువాడిలో కిరాణ దుకాణం నడిపిస్తున్నారు. ఆరు నెలల కింద కుమార్తె సుదీక్షకు జన్మనిచ్చిన మౌనికను అదనపు కట్నం తేవాలంటూ.. భర్తతో పాటు అత్తింటి వారి నుంచి వేధింపులు తీవ్రతరమయ్యాయి.
దీనితో తీవ్ర మానసిక వేదనకు గురైన మౌనిక తన ఆరు నెలల కుమార్తె సుదీక్షతో సహా భవనం కింది భాగంలో ఉన్న నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కుమార్తె మృతి చెందినట్లు మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: బతుకు భారమై.. రైతు ఆత్మహత్య