కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన మన్నే రాజు ఇండోసెండ్ బ్యాంక్ ఉద్యోగినంటూ పలువురిని మోసం చేశాడు. ఇంటి రుణాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి... వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అతని మాటలు నమ్మిన సంతోష్ అనే వ్యక్తి... అతనితో పాటు మరో నలుగురు ఒక్కొక్కరు 23,300 చొప్పున రాజుకు అందించారు.
డబ్బులు, ఇంటి కాగితాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా... రుణం మంజూరు కాకపోవడంతో రాజును గట్టిగా నిలదీశారు. ముందు డబ్బు ఇస్తామని హామీ ఇచ్చి.. అనంతరం డబ్బులు ఇవ్వలేదని ఎదురుతిరిగాడని బాధితులు పేర్కొన్నారు. డబ్బులు కోసం వేధిస్తే అందరి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటామని రాజు భార్య సుమలత బెదిరించిందని వాపోయారు.