తెలంగాణ

telangana

ETV Bharat / crime

మత్తుమందు ఇచ్చి.. గర్భిణిపై ఎంఎన్‌వో అత్యాచారయత్నం

Rape Attempt on Pregnant Lady
Rape Attempt on Pregnant Lady

By

Published : Apr 29, 2022, 8:11 AM IST

Updated : Apr 29, 2022, 4:30 PM IST

08:07 April 29

మత్తుమందు ఇచ్చి.. గర్భిణిపై ఎంఎన్‌వో అత్యాచారయత్నం

Rape Attempt on Pregnant Lady : భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై ఆపరేషన్ థియేటర్‌లో బుధవారం అత్యాచారయత్నం జరిగింది. మత్తు మందు ఇచ్చి ఎంఎన్‌వో లాల్‌ఖాన్ అత్యాచారయత్నం చేశాడు. ఆ విషయాన్ని గమనించిన సహద్యోగి వారించే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఉన్న లాల్‌ఖాన్‌.. అతడిపై దాడికి పాల్పడ్డాడు.

ఆ విషయంపై ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన పలువురు మహిళలు అతడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అత్యాచారయత్నంపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. మద్యం తాగి విధులకు హాజరు కావడం సహా.. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు రుజువుకావడంతో విధుల నుంచి తొలగించారు. తదుపరి విచారణకు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తామని.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 29, 2022, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details