MLC Son Playing Poker:ఓ టింబర్ డిపోలో పేకాడుతున్నారనే సమాచారంతో పోలీసులు ఆ శిబింరంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. అయితే.. ఈ బ్యాచ్లో అధికార పార్టీ ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉండగా.. తప్పించుకుని పారిపోయాడు. ఆ టింబర్ డిపో యజమాని కూడా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఏపీలోనిగుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది.
MLC Son Playing Poker: పేకాట బ్యాచ్లో అధికార పార్టీ ఎమ్మెల్సీ కుమారుడు..! - పోలీసులకు చిక్కిన ఎమ్మెల్సీ కుమారుడు
MLC Son Playing Poker: పేకాట ఆడుతున్న కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే వాళ్లందరి వివరాలు నమోదు చేసుకుంటున్న సమయంలో ఓ యువకుడు మాత్రం అందరినీ తోసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ యువకుడు ఎవరో కాదు.. స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్సీ కుమారుడు..!
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/16-January-2022/14201264_mlc.JPG
పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కుమారుడు.. వారిని తోసుకుంటూ వెళ్లిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. 14వ నిందితుడిగా టింబర్ డిపో యజమాని పేరు, 15వ నిందితుడిగా ఎమ్మెల్సీ కుమారుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. తప్పించుకున్న నిందితులను పట్టుకొని న్యాయస్థానంలో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :