జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మరో నిందితుడిగా ఎమ్మెల్యే కుమారుడు - మైనర్ బాలికపై అత్యాచారం
20:24 June 07
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మరో నిందితుడిగా ఎమ్మెల్యే కుమారుడు
Jubileehills Gang Rape Case: జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. బాలిక స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేసిన పోలీసులు మరొకరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురిని నిందితులుగా భావించిన పోలీసులు.. మరో నిందితునిగా ఓ ఎమ్మెల్యే కుమారుడిని కూడా చేర్చారు. అత్యాచారానికి పాల్పడిన బృందంతో సదరు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అఘాయిత్యానికి ముందే వాహనం నుంచి దిగిపోయాడని తొలుత తెలిపారు.
ఐదుగురు నిందితుల్లో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. సాదుద్దీన్‌తో పాటు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఐదో నిందితుడైన ఉమర్ఖాన్ పరారీలో ఉండగా.. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అఘాయిత్యానికి ఉపయోగించిన రెండు కార్ల నుంచి క్లూస్ టీం కీలక ఆధారాలు సేకరించింది. అందులో దొరికిన వీర్యనమూనాలను ఎఫ్ఎస్ఎల్కు పంపించింది. మరోమారు బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు.. ఫొటోలు, సీసీకెమెరా దృశ్యాలను చూపిస్తూ కీలక సమాచారం సేకరించారు.
ఇవీ చూడండి: