తెలంగాణ

telangana

ETV Bharat / crime

చలివేంద్రాల వద్ద.. ఎమ్మెల్యే సీతక్క ఫ్లెక్సీలు ధ్వంసం - సీతక్క ఫౌండేషన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 'సీతక్క ఫౌండేషన్' పేరిట ఏర్పాటు చేసిన చలివేంద్రాలు.. చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం ఎదుట.. ఎమ్మెల్యే ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో.. ఈ వివాదానికి తెరలేచింది.

MLA Seethakka flexi destroyed in bhadradri kothagudem
చలివేంద్రాల వద్ద.. ఎమ్మెల్యే సీతక్క ఫ్లెక్సీలు ధ్వంసం

By

Published : Mar 16, 2021, 9:41 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 'సీతక్క ఫౌండేషన్' పేరిట చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే అంటే గిట్టని వారే ఈ ఘటనకు పాల్పడినట్లు.. నిర్వాహకులు ఆరోపించారు.

కరోనా కాలంలో అడవుల్లో, కొండల్లో తిరిగి పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే సీతక్క అని ఫౌండేషన్​ నిర్వాహకులు కొనియాడారు. ఆమె చేసిన సేవలను ఆదర్శంగా తీసుకొని.. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు కొన్ని అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే.. పనులను రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు మోగిన నగారా...

ABOUT THE AUTHOR

...view details