తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆర్టీసీ బస్సు డ్రైవర్​పై ఎమ్మెల్యే అనుచరుల హల్ చల్... నెట్టింట్లో వైరల్‌ - MLA Followers of an huddled at the Raikal Toll Plaza

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్ చల్ చేశారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే వాహనానికి ఆర్టీసీ డ్రైవర్ దారి ఇవ్వలేదు. దీంతో బస్సుకు అడ్డంగా తమ వాహనాన్ని పెట్టి డ్రైవర్‌తో దుర్భాషలాడారు. ఈ ఘటనను తోటి ప్రయాణికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది

Viral video
Viral video

By

Published : Nov 7, 2021, 7:59 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూఖ్ నగర్ మండలంలో గల రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్ చల్ చేశారు. తమ వాహనానికి ఆర్టీసీ డ్రైవర్ దారి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాయికల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్ బీఆర్ రెడ్డి ఎమ్మెల్యే వాహనానికి దారి ఇవ్వలేదు. దీంతో బస్సుకు అడ్డంగా తమ వాహనాన్ని పెట్టి డ్రైవర్‌తో దుర్భాషలాడారు. ఈ ఘటనను తోటి ప్రయాణికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది

ఎమ్మెల్యే అనుచరులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధ కలిగించిందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నందున్నే దారి ఇవ్వలేదని బస్సు డ్రైవర్ బీఆర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని డిపో ఉన్నతాధికారులకు తెలిపినట్టు కండక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు తెలిపారు.

రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్ చల్

ఇదీ చదవండి:గంజాయి మొక్కల కలకలం.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పెంపకం..

ABOUT THE AUTHOR

...view details