MLA Aroori Ramesh Help : వరంగల్ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. పర్వతగిరి మండల కేంద్ర సమీపంలో కారు, బైక్ ఢీకొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అటు వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే వెంటనే క్షతగాత్రుల వద్దకు వెళ్లి అంబులెన్సుకు ఫోన్ చేసి... బాధితులను ఆస్పత్రికి తరలించారు.
అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి, ఎంజీఎం ఆస్పత్రి సూపరిటెండెంట్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు.