DEAD BODY FOUND AT BEACH: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ రుషికొండ బీచ్ వద్ద సోమవారం సాయంత్రం సముద్రంలో స్పీడు బోటు ఢీకొని గల్లంతైన మత్స్యకారుడు గణేశ్ (26) మృతదేహం లభ్యమైంది. నిన్న సాయంత్రం ప్రమాదం జరిగిన తర్వాత గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. చీకటి పడటంతో నిలిపివేశారు. అనంతరం ఉదయం నుంచి చేపట్టిన గాలింపు చర్యల్లో నీటి అడుగున ఉన్న గణేష్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇన్నాళ్లు 16మందిని కాపాడాడు.. ఇవాళ అదే సముద్రంలో చనిపోయాడు.. - telangan latest news
YOUNG MAN DEAD BODY FOUND: ఆ యువకుడు మృత్స్యకార కుటుంబానికి చెందిన గజఈతగాడు. గతంలో సముద్రంలో కొట్టుకుపోయిన 16మందిని కాపాడాడు. అందుకుగాను కేంద్ర యువజన శాఖ నుంచి పురస్కారం అందుకున్నాడు. అయితే నిన్న సముద్రంలో బోట్లు ఢీకొనడంతో ఆ యువకుడు గల్లంతయ్యాడు.
బోటు ప్రమాదంలో గజఈతగాడు మృతి
అయితే, శవ పంచనామా విషయమై మెరైన్, ఆరిలోవ పోలీసులు స్పందించకపోవడంతో మత్స్యకార కుటుంబాలు గంటల తరబడి ఎదురుచూస్తున్నట్లు సమాచారం. గతంలో 16మంది ప్రాణాల్ని కాపాడిన గణేష్.. తన సాహసానికి గుర్తింపుగా కేంద్ర యువజన శాఖ నుంచి అవార్డు కూడా పొందారు. సముద్రంలో కొట్టుకుపోతున్న ఎందరినో కాపాడిన యువకుడు.. అదే సముద్రంలో గల్లంతై ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా విచారకరమని స్థానికులంటున్నారు.
ఇవీ చదవండి: