తెలంగాణ

telangana

ETV Bharat / crime

అదృశ్యమైన యువకుడు దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణం - crime news in medchal district

మౌలాలిలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన బంధువర్గంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించటమేనని హత్యకు కారణమని మల్కాజిగిరి పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

missing young man brutally murdered in Maulali at medchal district
అదృశ్యమైన యువకుడు దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణం

By

Published : Mar 10, 2021, 8:29 AM IST

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మౌలాలీలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహమ్మద్ ముఖ్రం(25) హత్యకు గురయ్యాడు. బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి తల్లి కుర్షిద్​ బేగంతో కలిసి హాజరయ్యాడు. కార్యక్రమం జరుగుతున్న చోట తల్లిని వదిలి తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్​ కొట్టించుకునేందుకు బంక్​కు వెళ్తున్నానని వెళ్లిన ముఖ్రం తిరిగి రాలేదు.

కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లి కుర్షిద్​బేగం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా తన బంధువుల ఇంట్లో హత్యకు గురయ్యాడని సమాచారం అందింది. హత్యకు కారణం తనబంధువర్గంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించటమేనని మల్కాజిగిరి పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:కాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details