తెలంగాణ

telangana

ETV Bharat / crime

అదృశ్యమైన మహిళ.. కుంటలో శవమై తేలింది - telangana news

మూడు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ కుంటలో శవమై తేలింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

missing women death
అదృశ్యమైన మహిళ మృతి

By

Published : Apr 5, 2021, 5:38 PM IST

మతిస్థిమితం లేక మూడు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ కుంటలో శవమై తేలింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన ఈశ్వరమ్మ (50) గత వారం రోజులుగా మతిస్థిమితం లేక ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అదృశ్యం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా... ఇంటి సమీపంలోని ఈదుల కుంటలో శవమై కనిపించింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈశ్వరమ్మ మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని కుమారుడు సంపత్ తెలిపారు.

ఇదీ చదవండి:సరుకులు కొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి

ABOUT THE AUTHOR

...view details