సూర్యాపేట జిల్లా నాగారం మండలం (డి)కొత్తపల్లి వద్ద నిన్న మధ్యాహ్నం ఎస్సారెస్పీ కాలువలో గల్లంతైన కడారి దిలీప్ శవమయ్యాడు. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులోని గోపాలరెడ్డి నగర్ వద్ద కాలువలో మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...పోస్టుమార్టం కోసం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు అదృశ్యమైనట్లు నాగారం పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైందని ఎస్సై పి.హరికృష్ణ తెలిపారు.
కాలువలో గల్లంతైన బాలుడు శవమయ్యాడు.. - తెలంగాణ వార్తలు
సూర్యాపేట జిల్లా (డి)కొత్తపల్లి వద్ద కాలువలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అదృశ్యమైన బాలుడు మృతి, ఎస్సారెస్పీ కాలువలో బాలుడు మృతి