Misba Suicide Issue: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసులో నిందితుడు రమేశ్ బాబును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మిస్బా మృతి చెందిన నాలుగు రోజుల తర్వాత.. మృతికి కారకుడిగా భావిస్తున్న పాఠశాల కరస్పాండెంట్ రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్బా చదువుతున్న బ్రహ్మర్షి పాఠశాల నిర్వాహకులు ఫీజు విషయమై మిస్బాను వేధించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పాఠశాల కరస్పాండెంట్ రమేశ్ బాబు కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. శనివారం అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం స్థానికంగా కోర్టులో హాజరుపరిచి ట్రాన్‌సిట్ వారెంట్ ద్వారా పలమనేరుకు తీసుకువచ్చారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులెవర్నీ వదిలి పెట్టబోమని ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు.
మిస్బా ఆత్మహత్య కేసు నిందితుడు అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు - మిస్పా ఆత్మహత్య కేసు
Misba Suicide Issue: ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసులో నిందితుడు బ్రహ్మర్షి పాఠశాల కరస్పాండెంట్ రమేశ్ బాబును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులెవర్నీ వదిలి పెట్టబోమని ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు.
వైకాపా నేత పాత్రపై అనుమానాలు: వైకాపా నేత తన కూతురు మొదటి ర్యాంకు సాధించడానికి వీలుగా మిస్బాను బ్రహ్మర్షి పాఠశాల నుంచి పంపేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. వైకాపా నేత సునీల్‌కుమార్ కోసం ఆరా తీస్తున్నారు. మరో వైపు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శనివారం.. మిస్బా తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించారు. మాజీ మంత్రి, పలమనేరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి అమరనాథరెడ్డి మిస్బా ఇంటికి వెళ్లి చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. పార్టీ తరపున ఆర్ధిక సాయం చేశారు. రాజకీయాలకు అతీతంగా మిస్బా కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఎస్పీని ఆదేశించింది. పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్‌ను కోరింది.
ఇదీ చదవండి:Bus accident: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా ఎనిమిది మంది మృతి