మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లు గ్రామశివారులో ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ లింక్ ఊడిపోయి కూలీలు కింద పడ్డారు. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్ ట్రాలీ లింక్ ఊడి.. 30 మంది మిర్చి కూలీలకు గాయాలు - mahabubabad district news
మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ లింక్ ఊడిపోయి కూలీలు కిందపడిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మంది కూలీలు గాయపడ్డారు.
మిర్చి కూలీలకు గాయాలు
ఆమనగల్లు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాలగడ్డ తండాలో మిరపకాయలు ఏరేందుకు ట్రాక్టర్లో వెళ్తుండగా.. ట్రాక్టర్ ఇంజిన్‌కు ట్రాలీకి మధ్య లింకు ఊడిపోయింది. ట్రాక్టర్ అకస్మాత్తుగా ఆగడం వల్ల ట్రాలీ ముందు డోర్ ఊడిపోయి కూలీలంతా రోడ్డుమీద పడ్డారు.
- ఇదీ చదవండి :దయచేసి వినండి... ప్రత్యేక బాదుడు కొనసాగుతుంది