Mirchi Farmer suicide: మిర్చి తెగుళ్లు అన్నదాతలను కబలిస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయానికి తెగుళ్లు సోకటంతో... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మిర్చి రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బాలు.. వ్యవసాయ మార్కెట్‌లో పనిచేసుకుంటూ... తనకున్న 30 గుంటల భూమిలో మిర్చి పంట సాగు వేశాడు. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పండించాడు.
మిర్చి పంటకు సోకిన తెగుళ్లు.. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య - mahabubabad farmer
Mirchi Farmer suicide: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట చేతికి అందివచ్చే సమయంలో తెగుళ్లు సోకి నష్టపోయిన ఓ రైతు కృంగిపోయాడు. అప్పులు ఎలా తీర్చాలో అని మదనపడుతూ.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం మహబూబాబాద్‌లో చోటు చేసుకుంది.
![మిర్చి పంటకు సోకిన తెగుళ్లు.. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య Mirchi Farmer suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14039234-thumbnail-3x2-mirchi.jpg)
మంచిగా పంట వచ్చింది.. మిర్చి కూడా మంచి ధర పలుకుతుంది అని ఆనందపడేలోపు మిర్చికి తెగుళ్లు సోకింది. వరిలో సరైన దిగుబడి సైతం రాకపోవడంతో బాలు తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవటంతో మంగళవారం రాత్రి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వద్ద పురుగులమందు వాసనను గమనించి కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో.. మహబూబాబబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మార్గమధ్యలోనే బాలు మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం బాలు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:Murder: క్షణికావేశంలో మామను చంపిన అల్లుడు