తెలంగాణ

telangana

ETV Bharat / crime

Mirchi farmer suicide: అప్పుల బాధతో మరో మిర్చి రైతు బలవన్మరణం...

Mirchi farmer suicide: అప్పుల బాధతో మరో మిర్చి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. మిరపపంటకు వింత వైరస్​ సోకడంతో ఆశించిన దిగుబడి రాదనే మనస్తాపంతో తోటలోనే పురుగులమందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Mirchi farmer suicide
Mirchi farmer suicide

By

Published : Dec 31, 2021, 12:59 PM IST

Mirchi farmer suicide: అప్పుల బాధతో మరో మిర్చి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారులోని తండాలో మిర్చి రైతు అజ్మీరా శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీను తనకున్న మూడు ఎకరాల్లో మిర్చి తోటను, మరో ఎకరంన్నర కౌలుకు తీసుకొని వరిపంట వేశాడు. ఇప్పటికే రూ. 5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ఈ పంటతో అప్పులు తీరుతాయని భావించినప్పటికీ మిర్చికి వింత వైరస్​ సోకడంతో ఆశించిన దిగుబడి రాదని మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు ఎలా పూడ్చాలో తెలియక ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు.

గురువారం సాయంత్రం మిర్చి తోటకు మందు కొడుతూ భార్యను ముందుగా ఇంటికి పంపించాడు. అదే పురుగుల మందు తాగి ఇంటికి చేరుకున్నాడు. తోటకు ఎన్ని మందులు కొట్టినా ఫలితం కనిపించడం లేదు.. రూ. 5 లక్షల అప్పు ఎలా పూడ్చాలో తెలియక పురుగుల మందు తాగినా అని భార్యకు చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం మిర్చి రైతులకు పరిహారం చెల్లించి.. ఆదుకోవాలని తండా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:HM died due to transfers : బదిలీ ఆవేదనతో ఆగిన ప్రధానోపాధ్యాయుడి గుండె

ABOUT THE AUTHOR

...view details