తెలంగాణ

telangana

ETV Bharat / crime

Farmer suicide: అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య - వరంగల్ జిల్లాలో విషాదం

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో పురుగుల మందు తాగి మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 15 న మిరప తోటలో పురుగుల మందు తాగిన మహేందర్‌ చికిత్స పొందుతూ 16 వతేదీ మృచి చెందాడు.

Farmer suicide
అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య

By

Published : Jan 18, 2022, 5:44 AM IST

అప్పుల బాధతో మిర్చి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన గూబ మహేందర్ తనకున్న రెండెకరాల భూమిలో మిరప సాగు చేశాడు. రెండు లక్షలకు పైగా అప్పులు చేసి పెట్టుబడి పెట్టగా తామర పురుగుతో పంట నష్టపోయింది. తీరా పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో పంట మొత్తం దెబ్బతింది.

గతంలో ఉన్న అప్పులు ఎలా తీర్చాలో మదన పడుతూ మనస్తాపానికి గురైన మహేందర్ ఈ నెల 15 న మిరప తోటలో పురుగుల మందు తాగాడు. వెంటనే తొర్రూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 16న రాత్రి చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details