Minor Boy Suicide for Love Issue: ఒకరి ప్రేమ జీవిత భాగస్వామిని కోరుకుంటుంది... మరొకరి ప్రేమ పిల్లల భవిష్యత్తు కోసం పరితపిస్తుంది. ఒక మనసు పెద్దల్ని అయినా ఎదరించమంటుంది.. మరో మనసు సమాజ అడ్డు గోడలు దాటలేక సతమతమవుతుంది. ఎన్నో అవరోధాలు ఎదురవుతాయని తెలిసినప్పటికీ... కలిసి బతకాలనే కోరిక వారిని ముందుండి నడిపిస్తుంది. అయితే ఆ ప్రేమ వయసు పరిణతి చెందిన తరువాతే అయితే బాగుంటుంది. తెలిసీ తెలియని వయసులో కలిగే ఆకర్షణను ప్రేమగా ఊహించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు కొందరు. తాజాగా సికింద్రాబాద్లో కన్నవారు తన ప్రేమను కాదన్నారని మనస్తాపంతో .. ఓ మైనర్ బాలుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తల్లిదండ్రులు ఆలోచిద్దాం అన్నారు.. కానీ ఆ మైనర్ ఆత్మహత్య చేసుకున్నాడు.. - రైలు కిందపడి మైనర్ బాలుడు ఆత్మహత్య
Minor Boy Suicide for Love Issue: ఒక్కసారి ప్రేమిస్తే చాలు ప్రాణాలిచ్చేందుకు కూడా వెనకాడరు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమికులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం చూస్తున్నాం. కొందరు తమ ప్రేమను ఇంట్లో చెబితే ఒప్పుకుంటారో లేదో అని ముందే భయపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మైనర్ తన ప్రేమను ఇంట్లో చెప్పగా వారు కాస్త ఆగి ఆలోచిద్దాం అన్నడంతో.. మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ అనే 17 ఏళ్ల మైనర్ బాలుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో వారు వెంటనే ఒప్పుకోకుండా మరో సంవత్సరం ఆగిన అనంతరం ఆలోచిద్దామని చెప్పారు. వారి సమాధానానికి సంతోష్ మనస్తాపానికి గురయ్యాడు. దాంతో ఇవాళ ఇంట్లో నుంచి బయలుదేరిన బాలుడు సికింద్రాబాద్లో గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు తన ప్రేమ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: