Minor Lovers Suicide: అమ్మాయి, అబ్బాయి కలిసి బతకడానికి మనసులు కలిస్తే చాలనుకుంటుంది నేటి యువత. నేటి తరం పిల్లలు ఇలా ఆలోచిస్తే.. తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మరోలా ఉంటుంది. కొందరు మారుతున్న కాలానికి అనుగుణంగా సానుకూల దృక్పథంతో ఆలోచించినా.. మరికొందరు పరువు పోతుందనో, ప్రేమ వివాహాల మీద నమ్మకం లేకనో వారి ప్రేమకు అంగీకరించరు. ఈ క్రమంలో మనసిచ్చిన వ్యక్తిని మరిచిపోలేక మరణమే శరణ్యం అనుకుంటున్నారు. తాజాగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ఓ మైనర్ ప్రేమజంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దలు ఒప్పుకోలేదని.. చెరువులో దూకి మైనర్ ప్రేమజంట ఆత్మహత్య - చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య
Minor Lovers Suicide: చిన్న వయసులోనే ఆకర్షణను ప్రేమగా భావించడం... ఆ విషయం ఇంట్లో వారికి ఎక్కడ తెలుస్తుందోనన్న భయం ఒకవైపు... తెలిస్తే పెళ్లికి ఒప్పుకుంటారో లేదో... అనే ఆలోచనలతో ప్రాణాలు తీసుకునేందుకూ నేటి పిల్లలు వెనకాడటంలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఓ మైనర్ జంట ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో.. వాళ్లని పెద్దలు మందలించారు. దాంతో మనస్తాపానికి గురైన ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అసలేం జరిగిందంటే..మేడ్చల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో వాళ్లని మందలించారు. దీంతో మనస్తాపానికై గురైన ఇద్దరు నిన్న అదృశ్యమయ్యారు. ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌చెరువులో అమ్మాయి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... ఇద్దరు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం అబ్బాయి సురేందర్ మృతదేహం ఇవాళ వెలికితీశారు. ఇద్దరి మృతదేహాలను చూసి.. ఇరు కుటుంబాలు గుండెలు బాదుకుంటూ రోధించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: