Minor Lovers Suicide: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చోరపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని ఇరు కుటుంబాలను తీరని శోకసంద్రంలో ముంచేశాయి. గ్రామానికి చెందిన షిండే భిక్షపతి, సుగుణా దంపతుల కుమారుడు(17).. అదే గ్రామంలో ఉంటున్న బంధువులైన బాలు, స్రవంతి దంపతుల కుమార్తె ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పలేదు కూడా.
ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. గురువారం(ఫిబ్రవరి 10) రాత్రి సమయంలో.. ఇద్దరు కలిసి గ్రామ శివారులోని ఓ పెరట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమ్మాయి.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య విషయం చెప్పింది. ఆ మాట వినగానే తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే అబ్బాయి చనిపోయాడు. అమ్మాయిని మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది.