తెలంగాణ

telangana

ETV Bharat / crime

ROAD ACCIDENT: కారు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా తల్లిదండ్రులకు స్వల్పగాయాలు - రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారులు

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది(ROAD ACCIDENT). ఈ ఘనటలో ఇద్దరు చిన్నారులు సహా తల్లిదండ్రులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం వీరిని కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ROAD ACCIDENT, family injured in car accident
జాతీయ రహదారిపై కారు ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో గాయాలు

By

Published : Aug 20, 2021, 3:59 PM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ఆర్మూర్ పట్టణానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి ఆర్మూర్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నవీన్ భార్య ఒడిలో ఉన్న చిన్న పాప నిద్రమత్తులో కాలు స్టీరింగ్‌కు తగలడంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి... బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవీన్ పెద్ద కుమార్తె శాన్వికతో పాటు నవీన్, అతని భార్య, చిన్న కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


ఇదీ చదవండి:blackmailing: ఆన్​లైన్​ పరిచయం... ఫోటోలతో మోసం చేసేందుకు యత్నం

ABOUT THE AUTHOR

...view details