Girl Suspicious Death: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బీసీ కాలనీలో నిర్మానుష్య ప్రదేశంలో ఓ కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా... కారులో సుగుణ అనే 9 ఏళ్ల బాలిక మృతం దేహం బయటపడింది. దర్యాప్తు నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
రెండ్రోజుల క్రితం బాలిక అదృశ్యం.. కారులో విగతజీవిగా.. - telangana news
11:48 June 04
తొమ్మిదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి
తమ కూతురు మూడు రోజుల నుంచి కనిపించడం లేదని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని సుగుణ తల్లి అంజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కారు యజమానిపైనే సుగుణ తల్లి, ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఆధారాలను మీడియాకు విడుదల చేశారు. ఆ బాలిక ఆడుకుంటూ వెళ్లి కారు డోర్ ఓపెన్ చేయగా తెరచుకుందని.. ఆ సమయంలో కారులోకి వెళ్లిన అనంతరం డోర్ అన్లాక్ కాకపోవడంతో బయటకు రాలేకపోయిందని నాగర్‌కర్నూల్ సీఐ హనుమంతు వెల్లడించారు. అక్కడే ఊపిరాడక కార్లోనే చనిపోయి ఉండవచ్చని అన్నారు. కేసు నమోదు చేసి మరింత లోతుగా.. దర్యాప్తు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
"కారులో అమ్మాయి చనిపోయింది. కారు వాళ్లపైనే అనుమానంగా ఉంది. ఆ కారు ఎవరిదో తెలవదు. చెత్తబండి వాళ్లు మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారంట. ఎట్ల చనిపోయిందో తెలవడం లేదు. గురువారం మధ్యాహ్నం నాకు అన్నం తీసుకొస్తానని చెప్పిన మా అమ్మాయి.. అప్పటినుంచి కనిపించడం లేదు." -బాలిక తల్లి
"బీసీ కాలనీలో నివసిస్తున్న సుగుణ అనే బాలిక 2 రోజుల క్రితం తన ఇంటి నుంచి మధ్యాహ్నం వేళలో ఆడుకుంటూ కొంత దూరం వెళ్లింది.కొంత దూరంలో కారు ఉండడంతో.. ఆడుకుంటూ లెఫ్ట్ సైడ్ ముందు డోర్ ఓపెన్ చేయగా ఓపెన్ అయిందని దాంతో ఆ పాప కార్ డోరు తెరచుకొని లోపలికి వెళ్లింది. డోర్ తీసుకుని లోపలికి వెళ్లిన పాప డోర్ అన్లాక్ కాకపోవడంతో బయటికి రాలేకపోయింది. అక్కడే ఊపిరాడక కార్లోనే చనిపోయి ఉండవచ్చు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నాం."-హనుమంతు, సీఐ
ఇవీ చదవండి: