minor girl raped in nizamabad district: సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. వావివరుసలు మరిచి కామాంధులుగా మారి అమాయక ఆడపిల్లలను చెరబడుతున్నారు. బయట చెబితే చంపేస్తామంటూ బెదిరించి నెలలు, ఏళ్ల తరబడి వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. వాళ్లలో ఆత్మ స్థైర్యాన్ని చంపేస్తూ.. సమాజంలో వారికంటూ ఓ గుర్తింపు లేకుండా వారి జీవితాలను అగమ్య గోచరం చేస్తున్నారు.
అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు చనిపోతే అన్నీ తానై చూసుకోవాల్సిన పెదనాన్న.. మరో కీచకుడితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడి పాపం ఒడిగట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.