మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతిని అత్యాచారం చేసి హతమార్చిన కేసులో పోలీసులు నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాంపురం తండా శివారులో గిరిజన మైనర్ బాలికపై శనివారం హత్యాచారం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అరెస్ట్ చేసి, ఓ బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.
సంబంధిత కథనం:గిరిజన యువతిపై అత్యాచారం... హత్య
సీతారాంపురం తండాకు చెందిన మైనర్ బాలిక.. పక్కనే ఉన్న తండా ధర్మారంకు చెందిన రాజేశ్‌లు గత మూడు నెలలుగా చనువుగా ఉంటున్నారు. వారి పెళ్లికి బాలిక ఇంట్లో ఒప్పుకోలేదు. వారు మాత్రం ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. శనివారం రోజు బాలిక సోదరుడు హైదరాబాద్ వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రాజేశ్ బాలికకు ఫోన్ చేసి ఎస్సార్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్న మొండికట్ట గుట్ట వద్దకు రావాలని చెప్పడం వల్ల ఆమె అక్కడికి నడుచుకుంటూ వెళ్లింది. ఇద్దరూ గుట్టపై కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత… శారీరకంగా కలుద్దామని అడుగగా తనకు భయం వేస్తోందని.. ఎప్పుడూ అలా చెయ్యలేదని చెప్పగా రాజేశ్ బలవంతంగా అత్యాచారం చేశాడు.