ఏపీలోని కృష్ణా జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం(Gang Rape) జరిగింది. మాయమాటలు చెప్పి బాలికను ఇంటి వద్ద నుంచి గొడ్ల సావిడికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. అక్కడే మరో ఇద్దరు యువకులతో కలిసి ఆ బాలికపై అఘాయిత్యాని(Gang Rape)కి పాల్పడ్డాడు. తర్వాత ఆమెను తీసుకువెళ్లి వారి ఇంటి ముందు వదిలేసి పారిపోయారు.
Gang Rape : పశువుల పాకలో బాలికపై సామూహిక అత్యాచారం.. అక్కడి నుంచి తీసుకెళ్లి... - gang rape on minor girl in krishna district
ఏపీలోని కృష్ణా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలికకు మాయమాటలు చెప్పి గొడ్ల సావిడికి తీసుకెళ్లిన కామాంధుడు.. మరో ఇద్దరు యువకులతో కలిసి ఆమెపై అత్యాచారం(Gang Rape) చేశాడు. అనంతరం ఆమెను తీసుకెళ్లి బాలిక ఇంటి వద్ద వదిలేసి పరారయ్యారు.
minor-girl-rape-at-krishna-district
స్నేహితుల వద్దకు వెళ్లిందని అనుకున్న తల్లిదండ్రులు చిరిగిన బట్టలతో ఇంటికి వచ్చిన కుమార్తెను చూసి ఏమైందని ఆరా తీశారు. బాలిక అసలు విషయం చెప్పగా.. ఆమె తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి నిందితుల కోసం గాలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని బాధితురాలి తల్లిదండ్రులకు భరోసానిచ్చారు.
- ఇదీ చూడండి :Attack on MRO: జగనన్న లేఅవుట్లో వ్యవసాయం.. తహసీల్దార్పైదాడి
Last Updated : Sep 4, 2021, 11:07 AM IST