నల్లమల అటవీ ప్రాంతంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. రెండో రోజు ఉదయం నుంచే అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ శివారులోని పురులగుట్ట వద్ద.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. మన్ననూర్‌కు చెందిన ఓ బాలికను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సమయంలో చిన్నారి బిగ్గరగా కేకలు వేసింది. ఓ మహిళ ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పింది. స్థానికులు అమ్రాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు.
నల్లమల అటవీ ప్రాంతంలో బాలిక కిడ్నాప్.. గాలింపు ముమ్మరం - minor girl kidnap in amrabad
నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి గుర్తు తెలియని బాలిక కిడ్నాప్‌కు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు అమ్రాబాద్ పోలీసులు రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చర్యలు ముమ్మరం చేశారు.
![నల్లమల అటవీ ప్రాంతంలో బాలిక కిడ్నాప్.. గాలింపు ముమ్మరం girl kidnap in nallamala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12669111-445-12669111-1628065262179.jpg)
నల్లమలలో బాలిక కిడ్నాప్
సీఐ బీసన్న సిబ్బందితో కలిసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీ నరసింహులు, ఇతర పోలీసు సిబ్బంది కిడ్నాప్‌పై ఆరా తీస్తున్నారు. ఇంతవరకూ బాలిక ఆచూకీ తెలియలేదు.
ఇదీ చదవండి:GHMC: 'మ్యాన్హోల్లోకి దిగిన ఇద్దరూ మా సిబ్బంది కాదు'