తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gang Rape on minor: హైదరాబాద్​లో మైనర్​పై సామూహిక అత్యాచారం - hyderabad crime news

Gang Rape on minor: హైదరాబాద్​లో ఓ మైనర్​పై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాయమాటలు చెప్పి మిత్రుని గదిలోకి తీసుకెళ్లిన యువకులు.. అనంతరం ఆఘాయిత్యానికి పాల్పడ్డారు.

minor girl gang raped in Hyderabad
minor girl gang raped in Hyderabad

By

Published : Feb 22, 2022, 11:44 AM IST

Gang Rape on minor: హైదరాబాద్​ ఎస్​ఆర్​ నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. మాయ మాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన బాలిక(17)ది చెత్త ఏరుకుని జీవించే పేద కుటుంబం. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్‌ తీసుకువచ్చేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో అదే బస్తీకి చెందిన శివ(22) బాలికకు ఏవో మాటలు చెప్పి సమీపంలోని మరో బస్తీలో ఉండే కార్మికుడిగా పనిచేస్తున్న మిత్రుడు సాయి(20) గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఉదయం 4 గంటలకు వారి గది నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. దీంతో తల్లి వెంటనే ఎస్​ఆర్​నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు.. నిందితులు పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీచూడండి:ఈ దొంగ రూటే సెపరేటూ.. బంగారం, డబ్బు వదిలేసి దుస్తులెత్తుకెళ్లాడు!

ABOUT THE AUTHOR

...view details