Gang rape in Old city: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ తరహాలోనే... యువకులు మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగింది. ఆ మైనర్‌ను రెండు రోజులు పాటు ఓయో లాడ్జిలో ఉంచారు. ఆపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట ఆమెను కిడ్నాప్ చేసి... హైదరాబాద్‌లోని రెండు హోటళ్లకు బాలికను మార్చుతూ.. ఆపై ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మొదట సుజన్ స్టే ఇన్ హోటల్‌కు... తర్వాత త్రీక్యాసిల్ హోటల్‌కు ఆమెను నిందితులు తీసుకెళ్లారు. ఆ తరవాత ఓయో రూమ్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి.. అత్యాచారానికి ఒడిగట్టారు. తరువాత ఆ యువకులు బాలికను లాడ్జిలోనే వదిలి వెళ్లారు.
ఓయో రూమ్‌కు తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి.. బాలికపై గ్యాంగ్ రేప్ - పాతబస్తీలో సామూహిక అత్యాచారం
08:52 September 15
Gang rape in Old city
ఈ నెల 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో మందుల కోసమని బాలికను మెడికల్ షాప్‌కు పంపినట్లు ఆమె తల్లి తెలిపింది. తర్వాత ఆమె తిరిగి రాలేదని, భయంతో పలు చోట్ల వెతికిన ఆచూకీ దొరకలేదని ఆమె వెల్లడించింది. తమ కుమార్తె కనిపించలేదని 13వ తేదీన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యకేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు... ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు యువకులు బాలికకు తెలిసినవారే. వారిని రీన్ బజార్‌కు చెందిన సయ్యద్ రావిన్ష్, రియాసత్ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించి, అక్కడే అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.
గత రాత్రి బాలిక తల్లికి ఫోన్ చేసిన నిందితులు... మీ కుమార్తె మా వద్దనే ఉందని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఫోన్ నంబర్ ను బాలిక తల్లి పోలీసులకు ఇవ్వడంతో నింతులను రీన్ బజార్ లో పట్టుకున్నారు. ప్రస్తుతం బాలిక నడవలేని స్థితిలో ఉందని, చేతికి ఇంజెక్షన్లు గుచ్చిన ఆనవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది.
ఇవీ చదవండి: