Sexual harassments on Minor : అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రజాప్రతినిధి.. గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడినట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది.
ఏం జరిగింది?
నిర్మల్ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ సాజిద్ ఖాన్ గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు జిల్లా కేంద్రానికి చెందిన బాలిక.. బాలల సంరక్షణ విభాగాన్ని సంప్రదించింది. వారి సాయంతో శనివారం రాత్రి నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం బాలికపై అత్యాచారం జరిగిన విషయం వాస్తవమని తేలిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రజా ప్రతినిధిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. నిండుతుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు.