ప్రేమ పేరుతో ఓ బాలికను వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన బాలున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సోనుకుమార్ ఠాకూర్ అనే మైనర్... బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నాని మాయమాటలు చెప్పాడు. ఆ అమ్మాయి కూడా సోను మాటలు నమ్మి... అతడి మాయలో పడింది.
పెళ్లి చేసుకుంటానని పంజాబ్ తీసుకెళ్లి.. - minor boy trapped
ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని తనతో వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక లైంగికంగా వేధించసాగాడు. అసలు విషమేమిటంటే... ఇద్దరూ మైనర్లే. తమ కూతురు కన్పించట్లేదని తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టిన హైదరాబాద్ పోలీసులకు పంజాబ్లో చిక్కుముడి వీడింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సోనుకుమార్... బాలికను మూడు రోజుల క్రితం ఇంటి నుంచి తీసుకెళ్లాడు. కూతురు కనిపించటం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. చరవాణి సిగ్నల్స్ ఆధారంగా బాలిక పంజాబ్లో సోనుకుమార్తో ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ హైదరాబాద్ తీసుకొచ్చారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను తీసుకెళ్లాడని... అక్కడికి వెళ్లిన తర్వాత లైంగికంగా వేధించాడని... విచారణలో బాలిక వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరూ మైనర్లే కావటం గమనార్హం. సోనుకుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.