తెలంగాణ

telangana

ETV Bharat / crime

Minor boy suicide: 'అమ్మానాన్న.. నా ఫోన్​ అమ్మి అంత్యక్రియలు చేయండి' - minor boy suicide due to heart problem in kishan bagh

పదిహేడేళ్ల ప్రాయం.. ఇంకా జీవితంపై అవగాహన లేని వయసు. చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తు కోసం ఏం చదవాలి.. ఏమేం చేయాలి అని ఆలోచించాల్సిన తరుణం. కానీ ఇవేమీ ఆ అబ్బాయి ఆలోచించలేదు. తన ఆరోగ్యం గురించి వైద్యులు చెప్పిన మాట విని హతాశుడయ్యాడు. వైద్యం కోసం తల్లిదండ్రులను(Minor boy suicide) ఇబ్బంది పెట్టలేక తనువు చాలించాడు. హైదరాబాద్​లోని బహదూర్​పురా పీఎస్​ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Minor boy suicide
కిషన్​ బాగ్​లో మైనర్​ ఆత్మహత్య

By

Published : Oct 27, 2021, 10:19 AM IST

తల్లిదండ్రులకు తమ పిల్లల కంటే మరేదీ ఎక్కువ కాదని గ్రహించలేకపోయాడేమో ఆ అబ్బాయి(Minor boy suicide). కడుపున పుట్టిన బిడ్డల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారన్న సంగతి మర్చిపోయాడేమో. వారు క్షేమంగా ఉండటం కోసం ఏమైనా చేస్తారని ఊహించలేకపోయాడేమో. పిల్లలు లేకపోతే వారి జీవితం వ్యర్థం అని తెలుసులేకపోయాడేమో. అందుకే ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం(Minor boy suicide) మిగులుస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. హార్ట్​లో సమస్య​ ఉందని.. ఆర్థికంగా కన్నవాళ్లను ఇబ్బంది పెట్టలేక బలవన్మరణం చెందాడు.

సూసైడ్​ నోట్​

'అమ్మానాన్న.. నన్ను క్షమించండి. నాకు హార్ట్​లో ప్రాబ్లమ్​ ఉంది. వైద్యం ఖర్చుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను(Minor boy suicide). మీరంటే నాకు చాలా ఇష్టం. నా ఫోన్​ అమ్మండి. ఆ వచ్చిన డబ్బుతోనే అంత్యక్రియలు నిర్వహించండి.' అంటూ ఓ పదిహేడేళ్ల బాలుడు ఆత్మహత్యకు ముందు రాసి పెట్టిన లేఖ. చిన్న వయసులోనే గుండెలో(Minor boy suicide) సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో ఆర్థిక సమస్యల కారణంగా.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఓ బాలుడు. హైదరాబాద్​ పాత బస్తీలోని బహదూర్​పురా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆత్మహత్యకు ముందు పవన్​ రాసిన లెటర్​

ఫోన్​ అమ్మండి

కిషన్​ బాగ్​ ప్రాంతానికి చెందిన పవన్​కు(17).. హార్ట్​లో సమస్య ఉందని వైద్యులు చెప్పారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదని సమాచారం. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య(Minor boy suicide) చేసుకున్నాడు. తన తల్లిని ఇబ్బందిని పెట్టడం ఇష్టం లేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్​ నోట్​లో పేర్కొన్నాడు. అంత్యక్రియల కోసం తన ఫోన్​ అమ్మాలని లేఖలో పేర్కొన్నాడు.

కేసు నమోదు

కుమారుడిని ఆ స్థితిలో చూసిన ఆ తల్లి.. గుండెలవిసేలా(Minor boy suicide) రోదించడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న బహదూర్​పురా పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబసభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Two Customs Officials: లంచం కేసులో కస్టమ్స్‌ అధికారులకు రిమాండ్

ABOUT THE AUTHOR

...view details