Fake ID in the name of Minister Niranjan Reddy: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేరుతో ఓ సెల్‌ఫోన్ నంబరు ద్వారా గుర్తుతెలియని వ్యక్తి వాట్సప్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. మంత్రి ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని వనపర్తి జిల్లాలోని అధికారులకు, నేతలకు హాయ్.. హౌఆర్‌యూ అంటూ ఓ నంబరు నుంచి సందేశం వచ్చింది. మీరెవరని ఎవరైనా చాట్ చేస్తే తాను నిరంజన్.. మంత్రినంటూ జవాబిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి పీఆర్వో శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంత్రి పేరుతో వాట్సప్ చాటింగ్, సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు - సైబర్ నేరాలు తాజా వార్తలు
Fake ID in the name of Minister Niranjan Reddy మంత్రి నిరంజన్‌రెడ్డి పేరుతో గుర్తుతెలియని వ్యక్తి ఓ సెల్‌ఫోన్ నంబరు ద్వారా వాట్సప్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. మంత్రి ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని అధికారులకు, నేతలకు సందేశాలు పంపాడు. దీంతో మంత్రి పీఆర్వో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Niranjan Reddy
ఎవరైనా మంత్రి పేరుతో చాటింగ్ చేస్తే స్పందించవద్దని కోరారు. ఈ విషయమై వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్‌రెడ్డి ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని ఓ నంబరు నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు మెసేజీలు వచ్చాయని, ఇది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: