తెలంగాణ

telangana

ETV Bharat / crime

రాష్ట్ర ప్రభుత్వంపై ట్రోలింగ్, కేటీఆర్ స్పందన ఇదే

KTR tweet జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్​పై మంత్రి కేటీఆర్​ స్పందించారు. కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేశామని కేటీఆర్ ట్విటర్​ వేదికగా తెలిపారు. నిందితులు ఎక్కడకు తప్పించుకోలేరని పేర్కొన్నారు.

ktr
కేటీఆర్​

By

Published : Aug 20, 2022, 10:57 AM IST

KTR tweet: హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ అత్యాచార ఘ‌ట‌న కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేశామ‌ని మంత్రి కేటీఆర్​ ట్విటర్ వేదికగా తెలిపారు. రెండు నెలల క్రితం జరిగిన జూబ్లీహిల్స్ అత్యాచార ఘ‌ట‌న వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై ఇటీవ‌ల సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జ‌రిగింది. దీనిపై స్పందించిన కేటీఆర్ ఈ విధంగా బదులిచ్చారు. కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేశామ‌న్నారు. నిందితుల్ని జైలుకు పంపిన‌ట్లు ట్విటర్ వేదికగా మంత్రి తెలిపారు.

అయితే 45 రోజుల త‌ర్వాత హైకోర్టు వారి బెయిల్ మంజూరీ చేసిందని వెల్లడించారు. చ‌ట్ట ప్రకారం నిందితులకు శిక్షప‌డే వ‌ర‌కు త‌మ ప్రభుత్వం పోరాడుతుంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. చట్టంలో ఎన్నో లోపాలు ఉన్నాయని వాటి అన్నింటిని సరిచేయాలని పేర్కొన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని తెలిపారు. నిందితులు చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు.

జువైనెల్‌ చ‌ట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్నట్లు వెల్లడించారు. అందుకే నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ప‌క‌డ్బందీ చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని తాను డిమాండ్ చేస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి చనిపోయే వరకూ జైలులోనే ఉండాలన్న కేటీఆర్ అన్నారు. జీవిత ఖైదును నిజ‌మైన రీతిలో అమ‌లు చేయాల‌ని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details