వరంగల్‌కు చెందిన ఓ మూగ యువతికి చిన్నతనంలోనే తల్లి కాలం చేసింది. ఇటీవల తండ్రి పనిమీద బయటకు వెళ్లడంతో దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. చూపు సరిగా కనిపించని అమ్మమ్మకు చేదోడు వాదోడుగా ఉంటుంది.
ఆ మూగ యువతిపై ముగ్గురు బాలురు కన్నేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోకి చొరబడ్డారు. చూపు సరిగా కనిపించని అమ్మమ్మకు అనుమానం రాకుండా మాటల్లోకి దించారు. ఒక్కొక్కరుగా వెళ్లి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
తండ్రి ఇంటికి రాగానే యువతి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన బాలుర వయసు 15, 16 ఏళ్లు ఉంటాయని పోలీసులు గుర్తించారు.