ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని మునసబువీధిలో పాలబూతు యజమానిని దారుణంగా హత్య చేశారు. సురేశ్ ప్రభును చిరంజీవి అనే వ్యక్తి నరికి చంపాడు. తాను ప్రేమిస్తున్న యువతిని.. సురేశ్ ప్రభు ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా.. చిరంజీవి అతనిపై దాడి చేశాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ కొబ్బరిబోండాల కత్తితో నరికాడు.
MURDER: జంగారెడ్డిగూడెంలో పాలబూత్ నిర్వాహకుడి హత్య.. కారణమేంటి? - west godavari crime news
పాల బూత్ నిర్వాహకుడి హత్య
14:04 September 18
పాల బూత్ నిర్వాహకుడి హత్య
తీవ్రంగా గాయపడిన సురేష్ ప్రభును.. 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని.. విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. హత్య చేసిన చిరంజీవి కోసం.. పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:Prison: బ్లూ ఫిల్స్మ్ చూస్తున్నారా? అయితే నేరుగా జైలుకే.. రూ.10 లక్షల జరిమానా!