తెలంగాణ

telangana

ETV Bharat / crime

దివ్యాంగురాలిపై అత్యాచారం.. నిందితుడు అధికార పార్టీ మద్దతుదారుడిగా ప్రచారం ! - ఏపీ తాజా వార్తలు

ఓ మానసిక దివ్యాంగురాలిపై దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డిన అమానవీయ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అధికార పార్టీ మద్దతుదారుగా ప్రచారం సాగుతోంది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

rape on women
rape on women

By

Published : Jul 29, 2022, 12:00 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మానసిక దివ్యాంగురాలిపై దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మతిస్థిమితం సరిగాలేని యువతిపై.. వెంకటేష్‌ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఘటన సమాచారాన్ని స్థానిక తెలుగుదేశం నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా చంద్రబాబు.. కుప్పంలోని పార్టీ కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు. బాధితురాలికి, కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలవాలని ఆదేశించినట్లు స్థానిక నాయకులు తెలిపారు. కాగా అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అధికార పార్టీ మద్దతుదారుగా ప్రచారం సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details