Mentally Challenged Woman Raped: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో దారుణఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గేదెలు కాపరిగా వెళ్లిన ఓ మానసిక దివ్యాంగురాలిపై ఓ ప్రబుద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రోజుమాదిరిగా తమ ఇంట్లోని గేదెలను మేపటానికి అటవీ ప్రాంతానికి వెళ్లిన క్రమంలో ఆమెపై కన్నేసిన బండి కనకరాజు అనే వ్యక్తి... కొన్ని రోజుల క్రితం లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత... ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించి ఐదునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఇటీవల బాధితురాలు అనారోగ్యానికి గురవటంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా... విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు
మానసిక వికలాంగురాలిని బెదిరించి ఐదునెలలుగా అత్యాచారం - తెలంగాణ వార్తలు
Mentally Challenged Woman Raped: మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది.
Rape