తెలంగాణ

telangana

ETV Bharat / crime

Matrimony Mis usage : పెళ్లికి ముందు ఏకాంతంగా కలుద్దామంటారు.. వెళ్తే ఏం చేస్తారంటే.. - Matrimony Trap

Matrimony Mis usage : పెళ్లికాని అమ్మాయిలపై.. కొందరు యువకులు నయవంచక వలను విసురుతున్నారు. అంతర్జాల వివాహ వేదికల ద్వారా పరిచయం చేసుకుని.. విహారయాత్రలకు తీసుకెళ్లి వికృత రూపాన్ని చూపెడుతున్నారు. ఏకాంతంగా మాట్లాడుకుందామని పిలిచి.. వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Matrimony Mis usage
Matrimony Mis usage

By

Published : Mar 22, 2022, 10:11 AM IST

పెళ్లికి ముందు ఏకాంతంగా కలుద్దామంటారు.. ఆపై..

Matrimony Mis usage : జీవితంలో సరైన తోడును వెతుక్కునేందుకూ ఎన్నో డిజిటల్‌ వేదికలు వచ్చాయి. తమకు నచ్చిన వరుడు, వధువు కోసం.. ఎంతో మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. అయితే వీటినీ కొంతమంది కేటుగాళ్లు.. వికృత చేష్టలకు వేదికగా మార్చుకుంటున్నారు. మొదట అమ్మాయిలు, యువతుల ఇళ్లకు పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేందుకు వెళ్తున్నారు. వివాహానికి ముందే కొన్ని వ్యక్తిగత వివరాలు పరస్పరం పంచుకుందామని మర్యాద పూర్వకంగా అభ్యర్థిస్తున్నారు. ఏకాంతంగా మాట్లాడుకుందామంటూ.. విహారయాత్రలు ప్రతిపాదిస్తున్నారు. బెంగుళూరు, ముంబయి, గోవా లేదంటే.. హైదరాబాద్‌ శివార్లలోని రిసార్ట్‌లకు వెళ్దామని ఒప్పిస్తున్నారు. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లాక.. వారి అసలురూపం ప్రదర్శిస్తున్నారు. పెళ్లికిముందే లైంగిక కోర్కెలు తీర్చాలంటూ.. బలవంతం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు.

ఏకాంతంగా మాట్లాడదామంటారు..

Matrimony Trap : సికింద్రాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ యువతికి.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కొలువు చేస్తున్న యువకుడితో సంబంధం కుదిరింది. ఓ మాట్రిమొనీ ద్వారా అతడు పరిచయమయ్యాడు. ఈ ఏడాది మే లేదా జూన్‌లో వివాహం చేసుకుందామని అనుకున్నారు. రెండు రోజుల తర్వాత ఆ యువకుడు, యువతికి ఫోన్‌ చేసి.. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుందామంటూ.. రిసార్ట్‌కు రమ్మని ఆహ్వానించాడు. అక్కడికెళ్లాక రూమ్‌లో అసభ్య రీతిలో ప్రవర్తించగా.. యువతి అక్కడినుంచి పారిపోయి.. వివాహం రద్దు చేసుకుంది. ఈ తరహాలోనే మరికొన్ని కేసులూ నమోదయ్యాయి. కొంతమంది.. ఫొటోలు, వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

సినిమాలు.. షికార్లు..

Marriage Proposal Trap : బషీర్‌బాగ్‌లో ఉంటున్న మరో యువతి జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో హెచ్‌.ఆర్‌.విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తోంది. విజయవాడలో ఉంటున్న యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. తరచూ హైదరాబాద్‌కు వస్తూ ఆ యువకుడు ఆమెతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసి, సినిమా చూసి వెళ్లేవాడు. ఇలా ఊరికే విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం సినిమాలు షికార్లంటూ తిరగడం ఆ యువతికి నచ్చక అతడితో పెళ్లి తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు అతనితో పెళ్లి రద్దు చేశారు. వెంటనే ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేసి ఇద్దరం కలిసి తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నో చెప్పాలి..

"పెళ్లికిముందుకు బయటకు వెళ్దాం.. ఇద్దరమే ఉందామంటూ యువకులు ప్రతిపాదిస్తే.. నో చెప్పాలి. ఏకాంతం పేరుతో కొందరు యవకులు అమ్మాయిల పట్ల దారుణంగా ప్రవర్తించారు. హైదరాబాద్, బెంగుళూరు, దిల్లీ, ముంబయిలలో ఉంటున్న అమ్మాయిలు పాశ్యాత్య పోకడలకు అలవాటయ్యారని.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారనే అంచనాతో కొందరు యువకులు వారికి వల వేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి."

- షీ టీమ్స్

అంతర్జాల వివాహవేదికల ద్వారా పరిచయమైన యువకులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లకూడదని షీ బృందాలు హెచ్చరిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details