హైదరాబాద్‌లోని మైలర్‌దేవ్‌పల్లి దుర్గనగర్‌లో మెఫిల్ హోటల్ సిబ్బంది దుర్మార్గంగా ప్రవర్తించారు. మటన్ బిర్యానీ బాగోలేదన్నందుకు ఇద్దరు యువకులను చితకబాదారు. ఈ ఘటనలో ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయ్యాయి.
బిర్యానీ రుచిగా లేదన్నారని... బాదేశారు - హైదరాబాద్ తాజా వార్తలు
బిర్యానీ రుచిగా లేదన్నందుకు ఓ హోటల్ సిబ్బంది ఇద్దరు యువకులపై దాడికి దిగిన ఘటన హైదరాబాద్‌లోని మైలర్‌దేవ్‌పల్లి దుర్గనగర్‌లో జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులపై దాడి చేసినవారిని అదుపులోకి తీసుకున్నారు.
మటన్ బిర్యానీ బాగోలేదన్నందుకు చితకబాదిన మెఫిల్ హోటల్ సిబ్బంది
మెఫిల్ హోటల్‌కు మటన్ బిర్యానీ కోసం వచ్చిన యువకులు రుచి బాగోలేదని వారితో చెప్పారు. ఆవేశానికి గురైన హోటల్ సిబ్బంది వారిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. యువకులపై దాడి చేసినవారిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Encounter: మంప ఎదురుకాల్పుల్లో.. పెద్దపల్లి జిల్లా మావోయిస్టు మృతి