తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fraudsters in TTD: నకిలీ లేఖలను సృష్టిస్తూ... రెండు నెలల్లో 41 మంది అరెస్టు

శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే యాత్రికులను తిరుపతి, తిరుమలలో తిష్ఠ వేసిన దళారులు సులువుగా మోసగిస్తున్నారు. కొందరు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు దళారుల అవతారమెత్తి (Fraudsters in TTD) ఇతర రాష్ట్రాలవారు, సరైన ప్రణాళిక లేకుండా వచ్చే భక్తులే లక్ష్యంగా చేసుకొని బ్రేక్‌ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని నమ్మ బలుకుతున్నారు.

ttd cheaters
తిరుమలలో మోసగాళ్లు

By

Published : Sep 22, 2021, 9:39 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల లెటర్‌ప్యాడ్‌లపై నకిలీ సిఫార్సు (Fraudsters in TTD) లేఖలు సృష్టిస్తున్నారు. అవగాహన లేనివారిని ఎంచుకొని.. దర్శనం తేదీ ముగిసిన, ఆ రోజు కానివి, నకిలీ టికెట్లను అంటగడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధుల వాస్తవ సిఫార్సు లేఖలపై టికెట్లు సంపాదించి, అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. కరోనా కారణంగా తితిదే కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేస్తుండగా.. ఇటీవల పరిమితంగా సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తోంది. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం లేదు. ఈ నిబంధనలపై అవగాహన లేకుండా తిరుపతికి చేరుకున్న యాత్రికులు.. దళారులను ఆశ్రయించి (Fraudsters in TTD) మోసపోతున్నారు. అలిపిరి టోల్‌ప్లాజా దగ్గరే కొందరు పట్టుబడుతుండగా, మరికొందరు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లో తనిఖీల్లో దొరికిపోతూ ఇబ్బందుల పాలవుతున్నారు.

అనుమానితులపై నిఘా

దళారుల ఆటకట్టించేందుకు తిరుమల పోలీసులు ఇటీవల ప్రత్యేక బృందాన్ని నియమించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఆటో, జీపు డ్రైవర్లపై నిఘా పెట్టారు. పలువురిపై సస్పెక్ట్‌ షీట్లు, హిస్టరీ షీట్లు తెరిచారు. కొందరిపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నారు. వారి వాహన నంబర్లు, ఫొటోలను అలిపిరి సప్తగిరి చెక్‌పోస్ట్‌ సిబ్బందికి ఇచ్చి నిఘా పెంచారు. విజిలెన్స్‌, పోలీసు విభాగాలు కలిపి గత రెండు నెలల్లో తిరుపతి, తిరుమలలో 25 కేసులు నమోదుచేసి 41 మందిని అరెస్ట్‌ చేశారు. తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య.. యాత్రికులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. దర్శనం టికెట్లు, వసతి గదుల బుకింగ్‌, ఇతరత్రా సమాచారం కోసం తితిదే అధికారిక వెబ్‌సైట్‌ ‌www.tirupatibalaji.gov.inయాప్‌లు వినియోగించాలని కోరారు. తిరుపతి, తిరుమలలోని తితిదే సమాచార కేంద్రాల్లో సమాచారం పొందాలని సూచించారు.

  • కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పేరిట నకిలీ సిఫార్సు లేఖ సృష్టించిన ఆటోడ్రైవర్‌ శ్రీనివాస్‌.. రూ.18 వేలు తీసుకొని భక్తులకు బ్రేక్‌ దర్శనం టిక్కెట్లు ఇప్పించాడు. ఆనక పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదైంది.
  • తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై ఆరు టికెట్లు పొందిన భాస్కర్‌ వాటిని రూ.21 వేలకు భక్తులకు విక్రయించాడు. ఇది విజిలెన్స్‌, పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి భాస్కర్‌ను అరెస్ట్‌ చేశారు.
  • ఆర్మీ టీషర్టు వేసుకొని తిరుమలలో సంచరిస్తున్న ఓ వ్యక్తి.. బ్రేక్‌ టికెట్లు ఇప్పిస్తానంటూ యాత్రికులతో బేరమాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కూపీ లాగగా ఇలాంటి వారు 8 మందిని గుర్తించి, అందరిపైనా సస్పెక్ట్‌ షీట్‌ తెరిచారు.

ఇదీచదవండి.kia employees fight video : కియా పరిశ్రమలో ఉద్యోగుల ఘర్షణ వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details