తెలంగాణ

telangana

ETV Bharat / crime

కోర్టులో లొంగిపోయిన డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు బండారు హన్మంత్ - telangana drugs case

drugs case
కోర్టులో లొంగిపోయిన డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు

By

Published : Oct 29, 2021, 1:44 PM IST

Updated : Oct 29, 2021, 6:33 PM IST

13:40 October 29

స్థిరాస్తి వ్యాపారం చాటున డ్రగ్స్ తయారుచేస్తున్న హన్మంత్ రెడ్డి

మేడ్చల్ జిల్లాలో వారం క్రితం పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కోర్టులో లొంగిపోయాడు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న హన్మంత్​రెడ్డి రెండు రోజుల క్రితం ఎల్బీనగర్ కోర్టులో లొంగిపోయాడు. న్యాయస్థానం హన్మంత్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. హన్మంత్​రెడ్డిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎల్బీనగర్ కోర్టులో ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం దీనిపై వాదనలు జరగనున్నాయి.  

ఈనెల 23న ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 2 కోట్ల రూపాయల విలువైన మెపిడ్రిన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హన్మంత్​రెడ్డి, ఎస్కేఎస్​ రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇద్దరు పరారీలో ఉండటంతో ఎక్సైజ్​ పోలీసులు గాలించారు.  

నాగర్​కర్నూల్​ జిల్లా తిమ్మాజీపేట మండలం బావాజిపల్లికి చెందిన హన్మంత్ రెడ్డి మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్కేఎస్ రెడ్డి సాయంతో బెంగళూర్, గోవా, ముంబయి నుంచి మెఫిడ్రిన్​ను తీసుకొచ్చి.. నగరంలో పలువురికి హన్మంత్ రెడ్డి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్కేఎస్ రెడ్డి కోసం గాలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు... అతన్ని పట్టుకుంటే కీలక సమాచారం రావొచ్చని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:Drugs Seized in Medchal : రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. నిందితుల ఇళ్లలో సోదాలు

Last Updated : Oct 29, 2021, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details