తెలంగాణ

telangana

ETV Bharat / crime

'కౌన్సిలర్ల భర్తలు.. అర్ధరాత్రి ఫోన్ చేసి వేధిస్తున్నారు' - మెదక్ మున్సిపాలిటీ

కౌన్సిలర్ల భర్తలు.. అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లడుతున్నారని మెదక్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత ఆరోపించారు. కౌన్సిలర్ల వ్యక్తిగత పనుల కోసం.. తనను నియమించలేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వం.. తమను ప్రజల కోసం పంపిందని ఆమె గుర్తు చేశారు.

harassed by husbands of councilors
కౌన్సిలర్లు వేధిస్తున్నారు

By

Published : Apr 1, 2021, 9:27 AM IST

కౌన్సిలర్లు..​ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మెదక్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్​స్పెక్టర్ వనిత ఆరోపించారు. వ్యక్తిగత పనుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడారు.

కౌన్సిలర్ల భర్తలు.. అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతుంటారని వనిత కన్నీటి పర్యంతమయ్యారు. కౌన్సిలర్ కృష్ణారెడ్డి వ్యక్తిగత అవసరాలకు తానెందుకు పని చేయాలని ప్రశ్నించారు. పని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగంలో నుంచి తీసేసినా పర్లేదన్నారు.

ఇదీ చదవండి:మందుబాబుల మనసు మారే.. బీరు నుంచి లిక్కర్​కు చేరే..!

ABOUT THE AUTHOR

...view details