తెలంగాణ

telangana

ETV Bharat / crime

Doctor Suicide: ప్రముఖ వైద్యుడి సూసైడ్.. ఒంటి మీద డ్రెస్ ఎందుకు లేదు? అసలేం జరిగింది? - హైదరాబాద్ వార్తలు

అతనో వైద్యుడు. కానీ ఏం జరింగిందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మొదట బెంగళూరులో చనిపోదామనుకుని... ప్లాన్​ను హైదరాబాద్​కు మార్చుకున్నాడు. నిద్రమాత్రలు, తాడు తీసుకుని ఓ హోటల్​కి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న తాడుతో ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు. కానీ ఒంటి మీద దుస్తులు లేకుండా ఆత్మహత్య చేసుకోవడం పలు కారణాలకు దారి తీస్తోంది. అసలేం జరిగింది...

medak-doctor-committed-to-suicide-at-a-hotel-in-hyderabad
medak-doctor-committed-to-suicide-at-a-hotel-in-hyderabad

By

Published : Sep 14, 2021, 7:48 AM IST

Updated : Sep 14, 2021, 8:50 AM IST

‘నా ఫోన్‌ ఎత్తడం లేదు. ఆయనకు డయాబెటీస్‌ ఉంది. అన్నం తిన్నాడో.. లేదో..? కింద పడి ఉంటాడేమో ఒక్కసారి చూడండి’ అంటూ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భార్య కోరడంతో హోటల్‌ సిబ్బంది గది కెళ్లారు. ఎంత కొట్టినా తలుపు తీయలేదు. ఏం జరిగిందో చూద్దామని భవనం వెనుకున్న పైపును పట్టుకుని సిబ్బంది లోపలకు దిగారు. కొద్దిగా తెరిచి ఉన్న కిటికీలో నుంచి కనిపించిన దృశ్యం చూసి కంగుతిన్నారు. చివరకు.. తేరుకుని పైకొచ్చి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో సోమవారం బలవన్మరణానికి పాల్పడిన మెదక్‌ వైద్యుడు డా.చంద్రశేఖర్‌ కేసులో పలు అంశాలు వెలుగులోకొస్తున్నాయి.

బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా?

బెంగళూరులోనే బలవన్మరణానికి పాల్పడాలని డా.చంద్రశేఖర్‌ నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. నీట్‌ పరీక్ష రాయించేందుకు కుమారుడిని దంపతులిద్దరూ మెదక్‌ నుంచి నగరానికి తీసుకొచ్చారు. కుమారుడిని పరీక్ష కేంద్రంలోకి పంపించారు. అక్కడే భార్యను వదిలేసి బెంగళూరు వెళ్లాలని చంద్రశేఖర్‌ నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఇంటి దగ్గరే భార్యకు చెప్పాడు. తను అంగీకరించింది. తీరా.. అక్కడికొచ్చాకా ఆసుపత్రిలో రోగులు వేచి చూస్తుండటంతో ఆమె (భార్య కూడా వైద్యురాలే) వెళ్లిపోయింది. దీంతో ఆత్మహత్యకు వేదికను హైదరాబాద్‌కు మార్చి ఉంటాడని పోలీసులు నిర్ధారణకొచ్చారు.

ఆ బ్యాగ్‌ను జాగ్రత్తగా...

ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే చంద్రశేఖర్‌.. తాడు, 140 నిద్రమాత్రలు, రూ.73 వేలు ఓ బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు రెండు.. మూడు రకాలుగా యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చివరకూ.. తాను తెచ్చుకున్న తాడు సాయంతోనే ఉరేసుకున్నట్లు తేల్చారు. అయితే.. ఒంటిపై బట్టల్లేకుండా బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డాడు..? అన్నది మాత్రం మిస్టరీగానే మిగిలింది. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది..? హోటల్‌లో దిగినప్పటి నుంచి చంద్రశేఖర్‌ను కలిసేందుకు ఎవరైనా వచ్చారా..? అంటూ సీసీఫుటేజీని జల్లెడ పడుతున్నారు. ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడారా..? అంటూ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి:మందలించినా మానలేదు.. మనువాడిన మనిషిని వదిలేసి.. మరొకరితో.!

Last Updated : Sep 14, 2021, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details