తెలంగాణ

telangana

ETV Bharat / crime

పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. అక్రమ గుట్కా స్వాధీనం - Confiscation of gutka packets

ఎస్పీ చందన దీప్తి ఆదేశానుసారం మెదక్ జిల్లా ఎస్​ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. జిల్లాలోని శంకరంపేట్ (ఆర్) పీఎస్​ పరిధిలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

Confiscation of gutka packets
మెదక్ జిల్లాలో గుట్కా పట్టివేత

By

Published : Apr 5, 2021, 7:53 PM IST

గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గుట్కాను అమ్ముతున్న వ్యక్తిని మెదక్ జిల్లా ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్పీ చందన దీప్తి ఆదేశానుసారం మెరుపుదాడి చేయగా... శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కిరాణం యజమాని వీరమల్లు శ్రీనివాస్ ఇంట్లో అంబర్, జార్ధా, గుట్కా ప్యాకెట్లు పట్టుపడ్డాయి. వీటి విలువ సుమారు రూ. 1.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిషేధిత అంబర్, జర్ధా, గుట్కాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచారం ఉంటే డయల్ 100, లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 73306 71900 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టాస్క్​ఫోర్స్ సీఐ మురళి కుమార్, ఎస్ఐ విజయ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అచ్చంపేటలో 830 కిలోల నల్లబెల్లం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details