తెలంగాణ

telangana

ETV Bharat / crime

theft in hyderabad today: బ్యాటరీ కంపెనీలో భారీ చోరీ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

హైదరాబాద్‌ శివారులోని మైలార్​దేవ్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో భారీ చోరీ(theft in hyderabad today) జరిగింది. ఓ బ్యాటరీ కంపెనీలోని రూ.50 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలిలో పోలీసులు క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు.

Theft in Rangareddy Today, massive theft in hyderabad
బ్యాటరీ కంపెనీలో భారీ చోరీ,

By

Published : Nov 1, 2021, 12:43 PM IST

హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లి పోలీస్టేషన్ పరిధిలో భారీ చోరీ(theft in hyderabad today) జరిగింది. హెచ్​బీ బ్యాటరీ కంపెనీలో గుర్తుతెలియని దుండగులు భారీ చోరికి తెగబడ్డారు. అర్దరాత్రి కంపనీలోనికి చొరబడ్డ దుండగులు రూ.50 లక్షల నగదు ఎత్తుకెళ్ళారు. ఉదయం గమనించిన యజమాని సుదర్శనరెడ్డి డబ్బులు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్యూస్ టీంలను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details