ఏపీలోని కడప ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని రిమ్స్ ఆడిటోరియంలో భారీ చోరీ జరిగింది. సుమారు కోటి రూపాయలు విలువైన వస్తువులు దొంగలించారు. స్విచ్ బోర్డు మొదలుకుని సెంట్రల్ ఏసీ వంటి పెద్ద సామగ్రి సైతం చోరీకి గురైంది. కరోనా సమయం కావటంతో ఏడాదిన్నర కాలం నుంచి ఆడిటోరియంను ఉపయోగించటం లేదు.
స్విచ్ బోర్డు మొదలుకుని ఏసీ వరకు ఏదీ వదల్లేదు.. - Rims Auditorium latest news
ఏపీలోని కడప ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఆడిటోరియంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆడిటోరియంలో ఉన్న సామాగ్రి మొత్తం దొంగలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆడిటోరియంలో భారీ చోరీ
ఇదే అదనుగా.. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆడిటోరియంలోని సామగ్రి చోరీ ఒకటి రెండు రోజుల్లో అయ్యే పని కాదని పోలీసులు భావిస్తున్నారు. బయటి వారు ఈ చోరీ చేసే వీల్లేదని... అంతర్గత వ్యక్తులే కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం... దగ్ధమైన ఫర్నిచర్