Cigarettes Seized In Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఏదో రకంగా వస్తువులు , బంగారంను స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీలకు దొరకకుండా వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు అధికారులు. తాజాగా భారీ స్థాయిలో ఈ-సిగరెట్లు, సిగరెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఈ-సిగరెట్లు, సిగరెట్ల పట్టివేత - Shamshabad Airport latest news
Cigarettes Seized In Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిత్యం కట్టుదిట్టంగా తనిఖీలు చేపడుతున్నా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి విదేశాల నుంచి భారీ స్థాయిలో తరలిస్తున్న ఈ-సిగరెట్లు, సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సిగరెట్లు
రూ.1.15 కోట్ల విలువైన ఈ-సిగరెట్లు, సిగరెట్లు, ప్రొటీన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద 4,792 ఈ-సిగరెట్లు, 2.82 లక్షల సిగరెట్లు, 150 సీసాల ప్రొటీన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన 14 మందిని అదుపులోకి తీసుకొని సామాగ్రి తనిఖీ చేయగా ఈ వ్యవహారం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.