వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ మేరకు గోల్డ్‌ఫిష్ ఏడోబ్ సంస్థ ఎండీ చంద్రశేఖర్ ఫిర్యాదుతో చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారి గోల్డ్ ఫిష్ ఏడోబ్ సంస్థలో 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతానని సీఈవోగా చేరాడు.
పెట్టుబడి పెడతానన్నాడు.. నిండాముంచాడు.. ! - investment fraud news today
ఓ వ్యక్తి మరో వ్యాపార సంస్థలో 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతానని చెప్పి చీట్ చేశాడు. ఆ కంపెనీలో సీఈఓగా చేరి సంస్థకు నష్టాలు మూటగట్టాడు. అతని వ్యవహారం తెలిసి రాజీనామా చేయమని చెప్పిన తరువాత.. రెండు కోట్లకు పైగా మోసం చేశాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో సంస్థకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో… సీఈవో ఉద్యోగానికి రాజీనామా చేశాడని ఆ సంస్ధ ఎండీ చంద్రశేఖర్ తెలిపారు. ఈ తరుణంలోనే దాదాపు రెండు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు సంస్థ అతనికి ఇచ్చిన మెర్సిడైజ్ కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని తెలిపారు. చంద్రశేఖర్ కంప్లైంట్తో వ్యాపారి వేణుమాధవ్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:డేంజరస్ ముఠాకు మూడేళ్ల జైలు శిక్ష