సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రికల్ గోదాంలో చెలరేగిన మంటలు - ఎలక్ట్రికల్ గోదాంలో చెలరేగుతున్న మంటలు
08:41 January 12
Fire Accident: 5 అగ్నిమాపక వాహనాలతో మంటలార్పిన సిబ్బంది
Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌లోని రాణిగంజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయంలో.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. దట్టంగా పొగ వ్యాపించడంతో.. స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక వాహనాలతో సుమారు మూడు గంటల నుంచి శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటికి మొదటి అంతస్తులో వస్తు సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.